కాంగ్రెస్ అంటే మోసం, దగా, నయవంచన.
-మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి..
నేటి సాక్షి, పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి రైతుకి ఎకరానికి 15000 చెల్లించాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పదివేలు బిచ్చం అన్నరు. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నదేమిటి? నువ్వు పెంచిన రెండు వేలు ఏమిటి? ముష్టి వేస్తున్నవా? తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలుచేసి కేసీఆర్ రైతుబంధుగా నిలిస్తే.. హామీలకు కోతపెడుతూ రేవంత్రెడ్డి రాబందుగా మారాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం, నయవంచనని రుజువైంది. రైతు భరోసా ఎకరానికి 15 వేలిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి, 12 వేలకు కుదించడమంటే రైతులను మోసగించడమే. ఈ ద్రోహాన్ని రైతులు ఎప్పటికీ క్షమించరు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

