Saturday, March 21, 2026

తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్

  • బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్
  • ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

నేటి సాక్షి, లక్షెట్టిపేట ( బైరం లింగన్న) : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ ప్రజలను ఏకం చేసి మహా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని గాంధీ చౌక్ లో కేసీఆర్ జన్మదిన సంబరాలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా అయన నాయకులతో కలిసి మాట్లాడుతూ.. రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే పాటు బడ్డారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. అలాంటి మహా నేతకు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్, చాతరాజు రాజన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News