Saturday, March 21, 2026

బెజ్జంకిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

  • తెలంగాణ ప్రదాత, స్వరాష్ట్ర విధాత, కేసీఆర్

నేటి సాక్షి, బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలు బెజ్జంకి మండలంలో ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర అపూర్వం. ఆయన నాయకత్వంలో తెలంగాణ సాధించటమే కాక, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపారు. కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు” అని అన్నారు. తెలంగాణ ప్రజలకు మార్గదర్శిగా, జాతిపితగా కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. వేడుకల్లో భాగంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా, హరిత తెలంగాణ లక్ష్యంగా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య, అలాగే వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News