- చందుర్తిలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్): నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు.
కెసిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతోపాటు మొక్కలు నాటి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల కబాంద హస్తాలలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన ఘనత కేసిఆర్ దని కొనియాడారు. కెసిఆర్ నాయకత్వంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటా అనంతరం స్వరాష్ట్రాన్ని సాధించుకొని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్దని పేర్కొన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా స్వరాష్ట్ర స్వత్నికుడు, తెలంగాణ జాతిపిత, ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గా కెసిఆర్ కీర్తి ప్రతిష్టలు యావత్ సమాజం గుర్తుంచుకుంటుందని అన్నారు. కాగా మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేసి నా అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. లాంగ్ లీవ్ కెసిఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్లు డప్పుల అశోక్, ఏనుగుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకులు చంటి బాబురావు, బైరగోని రమేష్, దుమ్ము అంజయ్య, లింగంపల్లి కరుణాకర్, లకావత్ శత్రులాల్, అంబీరి నరేష్, పెగ్గర్ల రమేష్ రావు, కొమ్ము రమేష్, బత్తుల కమలాకర్, మాదాస్ ప్రసాద్, ఎండి ఇస్మాయిల్, అట్టేపల్లి భూమయ్య, రాపెళ్లి గంగాధర్, తుత్తల పరుశురాం, మల్యాల గంగ నరసయ్య, కొండ లక్ష్మణ్, దారం బాల్రెడ్డి, చిలువేరి రవి మెరుపుల గంగాధర్, పోతరాజు నగేష్, గుడిసె రమేష్, చల్ల శ్రీనివాస్, ఎండి సమీర్, వరికెల శ్యామ్ రావు, కపిల శంకర్, ముద్దసాని వెంకటేష్, అజ్మీర చంద్రు నాయక్ పూల్ సింగ్ ఆకుల ఎల్లయ్య, భూతల రాకేష్ అమరబండ జలంధర్, శేఖర్ రావు మారుపాక మధు, బత్తుల వంశీ తదితరులు పాల్గొన్నారు.





