Tuesday, March 31, 2026

స్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచండి

  • కమిషనర్ ఎన్. మౌర్య

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : నగరంలోని స్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ 33 వార్డు లోని హరిశ్చంద్ర స్మశాన వాటిక, దొబిఘాట్, సుందరయ్య నగర్, స్కావేంజర్స్ కాలని తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, అధికారులతో కలసి కమిషనర్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శ్మశానం చుట్టూ పక్కల ప్రాంతాల్లో చెత్త చెదారం ఉండడం పట్ల కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు. స్మశానంలో నెలకొని ఉన్న సమస్యలను ప్రజలు కమిషనర్ దృష్టి తెచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటికలను, దొబిఘాట్ ను శుభ్రంగా ఉంచాలని అన్నారు. స్మశాన వాటికలో కర్మక్రియలకు వచ్చే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సుందరయ్య నగర్, రైల్వే కాలని, స్కావెంజర్స్ కాలనిలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, తుడా ఈ.ఈ. రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు. రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి మూర్తి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, సుమతి అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News