Thursday, March 12, 2026

ప్రతి మూడవ శనివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

  • తుడ ఉపాధ్యక్షులు ఎన్. మౌర్య

నేటి సాక్షి, తిరుపతి (బాదూరు బాల) : ప్రతి మూడవ శనివారం స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ లో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తుడ ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య అన్నారు. శనివారం ఉదయం తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయంలో స్వచ్చాంద్ర – స్వచ్చ దివస్ కార్యక్రమం లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ స్వచ్చ భారత్ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి పల్లె, పట్టణంలో తమ ఇంటితో పాటు, పరిసరాల్లో క్లీన్ అండ్ గ్రీన్ పాటించడం జరుగుతోందన్నారు. దీనివల్ల చాలావరకు వ్యాధులు రావడం తగ్గిందన్నారు. ప్రతి మూడవ శనివారం పల్లెలు, పట్టణాలు, కార్యాలయాలు, పరిసరాలు శుబ్రపరుచుకోవాలని తెలిపారు. ఇందులో భాగంగానే తుడ కార్యాలయంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం ప్రతి రోజు పరిసరాల పరిశుభ్రత కొరకు సమయం కేటాయిస్తానని “స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ” చేసి కార్యాలయ ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తను సిబ్బంది తో కలిసి శుబ్రపరిచి, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డాక్టర్ వెంకట నారాయణ, ఎస్.ఈ.కృష్ణారెడ్డి, ఈ.ఈ. రవీంద్ర, ప్లానింగ్ అధికారి దేవి కుమారి, ఉద్యాన శాఖ అధికారి మాలతి, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News