నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కిట్స్ వరంగల్ ఇంజనీరింగ్ కళాశాల లోని సెంట్రల్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా పని చేస్తున్న ముచ్చకుర్తి నిరంజన్కి డాక్టరేట్ ను ఆంధ్ర ప్రదేశ్ కుప్పం లోని ద్రవిడియన్ విశ్వ విద్యాలయం వారు పి. హెచ్. డి డిగ్రీ అవార్డ్ చేశారనీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సీపాల్ ప్రో. కె. అశోక రెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం. ఆంజయ పర్య వేక్షణలో “అవైలబిలిటీ అండ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : ఏ స్టడీ ఆఫ్ న్యాక్ అక్రిడేటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్” అనే అంశంపై తన పరిశోధనను పూర్తి చేసి పరోశోధన గ్రంధాన్ని ద్రవిడియన్ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి సమర్పించారు. భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల గ్రంథాలయాల లో (ముఖ్యంగా తెలంగాణలో) ఎలక్ట్రానిక్ సమాచార వనరుల వాడకంలో మెళకువలు, వాటి ఉపయోగాల గూర్చి పరిశోధన చేశారు. గ్రంధాలయ శాస్త్ర సాహిత్యంలో అంతరాలను మరియు ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగంలో ఇటువంటి అధ్యయనం యొక్క ప్రాముఖ్యత మరియు అవసరాన్ని గుర్తెరిగి విద్యార్థులు మరియు అధ్యాపకుల ప్రయోజనం కోసం నూతన పద్దతుల ను కనుగొన్నారు. జాతీయ అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని తన పరిశోధన పత్రాలను సమర్పించారు.
ఏం. నిరంజన్ గ్రంథ పాలగుడిగా కిట్స్ వరంగల్ కళాశాలలో ఏడు సంవత్సరాలు మరియు మొత్తం 27 సంవత్సరాలు అనుభవం మరియు కాకతీయ యూనివర్సిటీ ఈ ఎస్ డి ఎల్ సి ఈ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలలో లైబ్రరీ సైన్స్ కోర్సులకు కౌన్సిలర్ గా 15 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా కిట్స్ కళాశాల యాజమాన్యం, రాజ్యసభ ఫార్మర్ ఎంపీ, కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కిట్స్ వరంగల్ కోశాధికారి పి. నారాయణరెడ్డి మరియు హుస్నాబాద్ నియోజకవర్గ ఫార్మర్ ఎమ్మెల్యే & కిట్స్డబ్ల్యు అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రో.పి. రమేష్ రెడ్డి, లైబ్రేరియన్ కె. ఇంద్రసేనా రెడ్డి, లైబ్రరీ కమిటీ చైర్ పర్సన్ అండ్ ఈ సి ఈ ప్రొఫెసర్ బి రమాదేవి, వివిధ విభాగాల డీన్లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, ఫ్యాకల్టీ, స్టాఫ్ మరియు కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ & పి. ఆర్.ఓ. డాక్టర్ డి. ప్రభాకరా చారి, అధ్యాపకులు మరియు సిబ్బంది డాక్టర్ ఏం. నిరంజన్ ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.





