తుక్కుగూడ సూరారం చెరువులో ఆక్రమణలు తొలగింపు.
చెరువు కబ్జాపై హైడ్రా, ఇరిగేషన్, పోలీసులకు గతంలో కిచ్చెన్న ఫిర్యాదు.
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్):
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ సమీపంలో సూరారం చెరువును కబ్జా చేసిన వారిపై హైడ్రా కొరడా ఝుళిపించటంపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ… గతంలో తానే స్వయంగా పోలీస్, ఇరిగేషన్, హైడ్రాకు కంప్లైట్ ఇచ్చినట్లు కేఎల్ఆర్ తెలిపారు. ( ఎఫ్ఐఆర్ నెంబర్ : 326/2024, సెక్షన్: 447/427 అండ్ 3 పిడిపిపిఏ) సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కిచ్చెన్న ఖండించారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి గోడలు కట్టిన అక్రమ నిర్మాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, హైడ్రా అధికారులను లక్ష్మారెడ్డి గతంలో కోరిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా… పట్టించుకోలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు కేఎల్ఆర్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా ఏర్పాటు చేశాక… చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలంటే ఆక్రమణదారులు బయపడుతున్నారని కిచ్చెన్నగారు చెప్పారు. భూకబ్జాదారులపై క్రిమినల్ కేసులు, పీడీయాక్ట్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతానని లక్ష్మారెడ్డి చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడైనా… ఆక్రమణలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కేఎల్ఆర్ కోరారు.





