నేటిసాక్షి, కొడిమ్యాల :
విద్యార్థినిలు బేటి బచావో! బేటి పడావో!! క్రీడోత్సవాల సందర్భంగా నిర్వహించిన కొడిమ్యాల మండల స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ అండర్ -18 క్రీడా పోటీలలో చక్కని ప్రతిభ కనబరిచి కొడిమ్యాల మండల జట్టుకు జగిత్యాల జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆచి విజయేంద్ర, ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజామల్లయ్యలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొడిమ్యాల పాఠశాలకు చెందిన విద్యార్థినులు కబడ్డీ క్రీడలో ఎం. రుచిత, కే.అనుష్క,ఎన్. ప్రవళిక, వాలీబాల్ క్రీడలో ఎం. లౌక్య, కే. అనుష్క, ఐ.అఖిల, ఖోఖో క్రీడలో పి. పూజ, ఎం. పల్లవి లు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ రన్నింగ్ విభాగంలో ఎం పల్లవి ఐ అఖిల, లాంగ్ జంప్ లో ఎం. పల్లవి, బి. ఆమనిలు ఎంపికైనట్లు వారు తెలిపారు. జగిత్యాలలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో ఈనెల 8న నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలలో వీరు పాల్గొంటున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలను ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అభినందించింది.





