Wednesday, March 11, 2026

ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కొలిచలం నరేష్

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి : కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా కొలిచలం నరేష్ ను నియమిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షులు వజ్జే వీరయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రెస్ క్లబ్ బలోపేతానికి కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాలలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సైతం ముందుండాలని ఈ సందర్భంగా వారు సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని, యూనియన్ జిల్లా అధ్యక్షులు వజ్జె వీరయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో వారు అందించే సలహాలు సూచనలతో ముందుకు కొనసాగుతున్న అని తెలిపారు.తన ఎన్నికకు సహకరించిన టియుడబ్ల్యూజే 143యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపరాజు హరికిషన్, నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు కు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News