Tuesday, March 24, 2026

యోగాలో సత్తా చాటిన కొంపెల్లి రమేష్ కుమార్

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో డ్రీమ్ యోగ ఫిట్నెస్ సొసైటీ నిర్వహించిన తెలంగాణ స్థాయి యోగా పోటీలలో పట్టణానికి చెందిన కొంపల్లి రమేష్ కుమార్ నాలుగు విభాగాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించారు. కొంపల్లి రమేష్ యోగాపుత్ర అవార్డుతో పాటు యోగ ఉపన్యాస పోటీలలో మొదటి బహుమతి, 56 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల కేటగిరిలో ప్రధమ బహుమతి, 30 సంవత్సరాలు దాటిన పురుషుల విభాగంలో ఛాంపియన్ షిప్ సాధించారు. ఈ సందర్భంగా రమేష్ ను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా రమేష్ కొంపెల్లి మాట్లాడుతూ, ఆరోగ్య వంతుడైన వ్యక్తి జీవితంలో ఏదైనా సాధిస్తాడని ఆరోగ్యానికి మించిన సంపద సృష్టిలో ఏదీ లేదని యోగ చేయడం ద్వారా శారీరక మానసిక దృఢత్వం ఏర్పడుతుందని కాబట్టి అందరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News