Monday, March 30, 2026

పసుపు రైతుల ధర్నాను విజయవంతం చేయండికోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్

నేటి సాక్షి, మెట్ పల్లి రూరల్ : నేడు పట్టణంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరగనున్న పసుపు రైతుల ఛలో మెట్ పల్లి ని విజయవంతం చేయాలనీ కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కోరారు. సోమవారం మెట్ పల్లి పట్టణంలోని మార్కెట్ యార్డును సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ పసుపుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రైతులు చేస్తున్న ధర్నాకు ప్రతి ఒక్క రైతన్న పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరారు.రైతన్నలను ఓట్ల కోసం మోసం చేస్తూ పదవిలో ఉంటూ పబ్బం గడుపుతున్న నాయకులని నిలదీయాలి అన్నారు. అంబాసిడర్ అని ఒక రోజు బెంజ్ కార్ అని ఇంకో రోజు రైతులను ఓట్ల కోసం వాడుకునే నాయకులని ప్రశ్నించాలి అని,అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సిసన్ లో పసుపు రైతులు కోటీశ్వరులు కాబోతున్నారు అని విచ్చల విడిగా అబద్ధాలు మాట్లాడిన నాయకులు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. చివరగా మరోసారి వేడుకుంటున్నా గతంలో జగిత్యాల వరకు మీ కోసం నేను చేసిన పాదయాత్రకు మించి మంగళవారం రైతు ధర్నా వియవంతం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News