నేటి సాక్షి, కోరుట్ల అర్బన్(వీఆర్ ధర్మేందర్): కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్సంజయ్కుమార్ను సోమవారం పోలీసులు హౌస్అరెస్ట్చేశారు. బీఆర్ఎస్నియమించిన త్రీమెన్కమిటీలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఉన్నారు. వీరు గాంధీ ఆసుపత్రిని చూసేందుకు వెళ్లేందుకు సిద్ధం కాగా, వారివారి ఇండ్ల వద్దకు పోలీసులు చేసుకొని, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బయటికి వెళ్లే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా, ఆసుపత్రుల సందర్శనకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్లుగా తాము గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని కమిటీలోని నాయకులు ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో తమ పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా? లేదా తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతుందని విమర్శించారు. పోలీసులు తమ ఇండ్ల నుంచి వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.