నేటిసాక్షి, కోరుట్ల:
కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామిఆ లయంలో, బండలింగాపూర్ ఆలయాల్లో ధనుర్మాసం ఉత్సవాలను పురస్కరించుకొని గోదాదేవి రంగనాయకుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గం సస్యశ్యామలంగా పాడి, పంటలతో తులతూగాలని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావుతో పాటు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల మున్సిపల్ వార్డు కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు పుప్పాల ప్రభాకర్, వెలుముల శ్రీనివాసరావు, రామానుజమ్, శేఖర్, జంగా గంగ స్వామి, తదితరులు పాల్గొన్నారు.





