నేటిసాక్షి, రాయికల్ : బిఆర్ఎస్ హాయంలోనే రాయికల్ పట్టణం అభివృద్ది జరిగిందని, రూ. 25 కోట్ల నిధులను అప్పటి మంత్రి కెటిఆర్, అప్పటి ఎంపి కల్వకుంట్ల కవితల సహకారం వల్లనే సాధ్యపడిందని మాజీ జెడ్పి చైర్‌పర్శన్ దావ వసంత తెలిపారు. దాంతో రాయికల్ బిఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, అప్పటి మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కవితల చిత్ర పటాలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్‌రెడ్డి, మారంపెల్లి సాయికుమార్, వల్లకొండ మహేష్, శ్రీరాముల సువర్ణసత్యనారాయణ, పార్టీ శ్రేణులు బర్కం మల్లేశం, కెజిరాం, ఎనుగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





