నేటి సాక్షి, వేమనపల్లి: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ముల్కలపేట-రాచర్ల మద్యలో ఉన్న బొందచెను ఒర్రే బ్రిడ్జికి ఇరువైపుల ఉన్న అప్రోచ్ రోడ్డు ప్రాణహిత నది వరద తాకిడికి కుంగి పోయింది. దీంతో కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా ప్రాణహిత నది వరద తగ్గుముఖం పట్టడంతో గ్రామానికి చెందిన యువకులు శ్రమదానం చేసి బ్రిడ్జికి ఇరువైపుల కంకర పోసి ద్విచక్ర వాహనలు వెళ్లడానికి దారి ఏర్పాటు చేశారు. దీంతో ముల్కలపేట నుంచి రాచెర్ల కోటపల్లి మండల గ్రామాలు వెంచపల్లి, సుపాక, జనగామ, సుమారు పది గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లపెల్లి వెంకటి, కొండ్ర పున్నం, ముంజం లచ్చన్న, డోలె రాజబాపు శ్రమదానం చేశారు.