- సన్నాహక సదస్సును విజయవంతం చేద్దాం
- జనవరి 8 న ఉమ్మడి కరీంనగర్ జిల్లా అలుగునూరు నుండి మాదిగల రథయాత్ర ప్రారంభం
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలం కేంద్రం లో మాదిగ కళామండలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ప్రజా గాయకుడు రామంచ భరత్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పులుపు మేరకు వెయ్యి గొంతులు, లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన నిర్వహణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏపూరి సోమన్న నేతృత్వంలో ఫిబ్రవరి 7న నాడు హైదరాబాద్ లో జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జనవరి 8న అలుగునూర్ నుండి మాదిగ కళాకారుల రథయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బెజ్జంకి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోయిని కొమురయ్య మాదిగ కలమండలి జిల్లా అధ్యక్షులు అంబాలా ప్రభాకర్, మాదిగ కళ మండలి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి రామంచ, భారత్ మాదిగ, గన్నేరువరం మండల అధ్యక్షులు రేపాక బాబు మాదిగ, ఉపాధ్యక్షులు కళ్లేపల్లి సురేష్ మాదిగ, ప్రధాన కార్యదర్శి రామంచ సతీష్ మాదిగ, కార్యదర్శి వేధిర ఐలయ్య మాదిగ, సంయుక్త కార్యదర్శి వేధిర రాజకుమార్ మాదిగ, గన్నేరువరం టౌన్ అధ్యక్షులు రామంచ సంపత్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ మాదిగ, మాతంగి అనిల్ మాదిగ, మండల మాదిగ కుల బంధావులు పాల్గొన్నారు.

