Thursday, March 12, 2026

రైతు భరోసా కోసమే భూ సర్వే: అధికారులు

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్) : రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు కోసం కసరత్తు ప్రారంభించింది. రైతు భరోసాను ఎకరాకు రూపాయలు 12,000 చొప్పున ఇస్తామని, వాటిని ఈనెల 26 నుంచి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి విధి విధానాలతో సాగుకు యోగ్యం కానీ భూములకు భరోసా ఇవ్వమని సృష్పం చేయగా, సంబంధిత అధికారులు భూ సర్వే చేపట్టి సాగుకు యోగ్యం కానీ భూములను గుర్తించేందుకు గాను రెవెన్యూ గ్రామాల వారిగా సర్వే చేపట్టలన్న ప్రభుత్వ ఆదేశాలతో శనివారం మండలంలోని ముంజంపల్లి, సానబండ, పాతగూడూర్, సూరారం గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయ, పంచాయితీ అధికారులు ఆయా గ్రామాల్లో భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆయా గ్రామాల్లోని ఆర్వోఆర్, పట్టదారు పాసు పుస్తకాల జాబితాలను, ధరణి పోర్టల్ నుంచి ప్రింట్ తీసుకొని గ్రామ గూగుల్ మ్యాప్ లతో పోలుస్తూ వ్యవసాయ సాగుకు యోగ్యం కానీ భూముల జాబితాను రూపొందించారు. కాగా వ్యవసాయ యోగ్యం కానీ భూములను తొలగించి మిగిలిన భూములకు ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వేలో మండల వ్యవసాయ శాఖ అధికారి కమల్ల మహేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు బలిజపల్లి సందీప్, మౌనిక, లావణ్య, రెవెన్యూ, పంచాయతి రాజ్ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News