నేటి సాక్షి, జమ్మికుంట: విలేఖరి అయిత రాధాకృష్ణ మాతృమూర్తి రాజ్యలక్ష్మి ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా “తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ”, రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, అయిత రాధాకృష్ణ స్వగ్రామం జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయిత రాజ్యలక్ష్మి మరణం చాలా బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటూ నివాళులర్పించారు.





