- లోకల్ కంప్లయింట్ కమిటీ చైర్మన్, స్పెషల్ డిప్యూటీ కలక్టర్ ప్రమోదిని

నేటి సాక్షి ప్రతినిధి, వనపర్తి జిల్లా ఫిబ్రవరి 01 : వనపర్తి జిల్లా ఐ.డి. ఒ.సి. సమావేశ మందిరంలో శనివారం మధ్యాహ్నం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశం నిర్వహించారు.పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునే విధంగా మహిళా రక్షణ చట్టాలు, జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేసేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, ఆ పై జిల్లాస్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా చైర్మన్ ప్రమోదీని మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. కార్యాలయాలలో తదితర ప్రదేశాలలో మహిళలపై శారీరిక, మానసిక వేధింపులకు పాల్పడితే బాధ్యులపై చట్ట పరంగా తగిన శిక్షలు ఉంటాయని బాధితులు ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేయాలని లేదా లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.లోకల్ కంప్లయింట్ కమిటీ మొదటి సమావేశం శనివారం నిర్వహించగా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రజనీ మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల విధానాలు, చట్టం ద్వారా మహిళలకు రక్షణ పై అవగాహన కల్పించారు.ఇంటర్నల్, లోకల్ కమిటీల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మహిళల కోసం ఉద్దే శించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు , మహిళలకు, వరద బాధితులకు మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఉచిత న్యాయ సహాయం అందుతుందని అదేవిధంగా త్వరి తగతిన ఉచిత న్యాయ సహాయం పొందుటకు నల్సా టోల్ ఫ్రీ నెంబర్. 15100 కాల్ చేసి పొందవచ్చని తెలియజేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టి న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, కమిటీ సభ్యులు డి.ఆర్డీఓ ఉమాదేవి,జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి పరిమళ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ చిన్నమ్మ థామస్, సిడిపిఓలు, లక్ష్మమ్మ, హజీరా, బాలేశ్వరి, సూపర్డెంట్ అరుంధతి, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం నుండి డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ భాస్కర్ , జనరల్ స్పెషలిస్టులు శ్రీవాణి, సలోమి స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ సుమ, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





