Saturday, March 21, 2026

న్యాయ చైతన్య సదస్సు

నేటి సాక్షి, లీగల్ న్యూస్, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి మాట్లాడుతు, రైతులు విత్తనాలు మరియు పురుగు మందులు పురుగులు కొనుగోలు సమయంలో కచ్చితంగా లైసెన్స్ షాపులోనే తీసుకోవాలని, అలాగే విత్తనాలు కొన్న, పురుగు మందులు కొన్న కచ్చితంగా రసీదు తీసుకోవాలని వారు సూచించారు.ఆళ్ళపల్లి మండలం పెద వెంకటాపురం రైతుల అభ్యర్థన మేరకు, త్రీఫేస్ మోటార్ కరెంట్ లైన్, మరియు రోడ్డు, సంబంధిత విషయాలుఅధికారుల ద్వారా, తక్షణమే న్యాయం జరిగేటట్లుగా చూస్తాము అని, అలాగే యువత మత్తు పదార్థాల కు బానిసలకు కాకుండా, సన్మార్గం వైపు నడవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మరియు మోటార్ వెహికల్ లైసెన్సు ఉండాలి అని, అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉండాలని, ఒకవేళ వారికి లేనట్లయితే, 50 నుంచి 100 మంది ఉన్నట్లయితే వారికి ఇన్సూరెన్స్ కంపెనీ పిలిచి ఇన్సూరెన్స్ కలిపిస్తామని, అలాగే ఆర్టిఏ వారిని పిలిచి లైసెన్స్ కూడా ఇప్పించడంజరుగుతుందని పేర్కొనడం జరిగింది. మారుమూల గ్రామాలలో జరిగే బాల్య వివాహాలు పద్ధతిని ప్రోత్సహించకూడదని, అలా ఎవరైనా జరిపితే, వివాహము చేసిన వారిపైన, ఆవివాహానికి హాజరైన వారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే బాల బాలికలను ఎవరైనా బాల కార్మికులగా పనిలోచేర్చుకుంటే, వారి పైన చట్టారీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు పేర్కొనడం జరిగింది. కార్యక్రమం అనంతరం ఆళ్లపల్లి మండలంలో ఉన్న వసతి గృహాలను తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్లను సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, పి ఎల్ వి గుండె బోయిన రామకృష్ణ, వ్యవసాయ అధికారి, ఏవో, కే అనిల్ కుమార్, ఏ.ఈ.ఓ. రావూరి విజయ వంశీ, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, మండలంలోని ఆళ్లపల్లి, ఇప్పన పల్లి, పెద్ద వెంకటాపురం, రామానుజగూడం, మైలారం, పాతూరు, ఈ గ్రామ రైతులు మరియు గ్రామ పెద్దలు యువకులు, గోగ్గెల లక్ష్మయ్య, జార రాజేందర్, ఈసం వెంకయ్య, కుంట వెంకటరాములు, గౌరబోయిన సుబ్బారావు, నాగపాణి, కండె రామ్మూర్తి, గాద రాజు, చెన్నయ్య, సందీప్, మహేష్, రవి, నవీన్, చందు, ప్రదీప్, శ్రీను, శేఖర్, తదితర గ్రామ పెద్దలు రైతులు, మరియు యువకులు, విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News