నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఖమ్మం జిల్లా కోర్టు కు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్ న్యాయవాదికి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు సోమవారం సాయంత్రం కోర్ట్ ఆవరణలో శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన, రెండవ తేదీన నిర్వహించనున్న మీటింగ్ కు రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ రాక సందర్భంగా ఖమ్మం లీగల్ సేల్ న్యాయవాదులతో కలిసి సమీక్షించడం జరిగింది. రాష్ట్రస్థాయి లీగల్ సెల్ మీటింగ్ ను విజయవంతం చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ సింగం జనార్ధన్, మాజీ బార్ అసోసియేషన్ సెక్రెటరీ మల్లెపల్లి బసవయ్య, సీనియర్ కాంగ్రెస్ న్యాయవాదులు డోన్వత్ వెంకయ్య,బాజీ జాలావతి, హారిక, చార్లెస్ వినయ్, సలావుద్దీన్, జీ.వీ లక్ష్మీనారాయణ, తెల్లాకుల రమేష్ బాబు, ధర్మేందర్ , అశోక్ తదితరులు పాల్గొన్నారు.





