నేటి సాక్షి, వేమనపల్లి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డా. రాజేశ్ మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఈ నెల 30 నుండి వచ్చే నెల 13వ తేదీ వరకు గుర్తించనున్నట్లు తెలిపారు. కుష్టు వ్యాధి “మైకో బ్యాక్టీరియం లెప్రె”అను బ్యాక్టీరియా వలన వస్తుందని ఈ యొక్క వ్యాధి లక్షణాలు స్పర్శ లేని మచ్చలు చర్మం పైన ఎర్రని గోధుమ రంగు మోద్దు బారిన మచ్చలు ఉంటే కుష్టి వ్యాధిగా గుర్తించి వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు ఎవరికైనా రావచ్చు ఈ వ్యాధి అంటే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు. తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ అపరంజి,రాం శెట్టి బాపు, స్టాఫ్ నర్స్ శివరంజని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





