Friday, March 20, 2026

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ముందుండి గెలిపిద్దాం

  • ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన సత్యం

నెట్ సాక్షి, రామడుగు (పురాణం సంపత్) : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డిని కార్యకర్తలు అందరూ ముందుండి గెలిపించాలని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామడుగు మండలంలోని షా నగర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. అది స్థానం నిర్ణయించిన వారిని భుజాలపై ఎత్తుకొని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. అలాగే లక్షల మందికి ఉపాధి కల్పించిన నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను సూచించారు. టిఆర్ఎస్ పార్టీ నేడు బిజెపి పార్టీకి వత్తాసు పలుకుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడకపోవడం లో ఆంతర్యం ఏంటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, గోపాల్ రావు పేట మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల-తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పుల అంజనీ ప్రసాద్, పలు గ్రామా సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News