- వనపర్తి జిల్లా అడక్ కమిటీ కన్వీనర్ మోడల తిరుపతయ్య సగర
నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జడ్పీ గ్రౌండ్ లోజరిగే సగర మహాసభ విజయవంతం చేయాలని వనపర్తి జిల్లాలోని 15 మండలాలు ఐదు మున్సి పాలిటీల నుండి ప్రతి సగర మహిళలు కుల యువకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని సగరుల ప్రధానమైన డిమాండ్లు నెరవేర్చుకునే దిశగా ప్రతి ఒక్కరు కంకణం బద్ధులై భారీ సగర బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లె సత్యనారాయణ సగర రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుక సత్యం సగర పట్టణ మాజీ అధ్యక్షులు పెద్దనాగులు సగర జిల్లా మాజీ ఉపాధ్యక్షులు గంగాపురి స్వామి సగర చీర్ల జనార్ధన్ సగర వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షులు మురళి సగర, గొబ్బూరి చంద్రయుడు సగర, గుంటి సత్యం సగర, మోడల రవి సగర, అరవింద్ సగర, యాదగిరి సగర, అంజి సగర, పోతులపల్లి వెంకటేష్ సగర తదితరులు పాల్గొన్నారు.





