- ప్రైవేట్ కరుణకు వ్యతిరేకంగా పోరాడుదాం
- ముక్కెర రామస్వామి
నేటిసాక్షి, వరంగల్:
విద్యుత్ రంగ ప్రయివేటికరణను వ్యతిరేకిస్తూ కరీమాబాద్ సబ్ స్టేషన్ వద్ద సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు ముక్కెర రామస్వామి మాలోత్ సాగర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం గతం కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక వినాశకర విధానాలను అవలంబిస్తున్నది. విద్యుత్ రంగంపై బిజెపి ప్రభుత్వం దాడి చేస్తుంది. ఈ మద్య కాలంలో చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో డిస్కంలనూ ప్రవేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రాలలో దొడ్డిదారిన స్మార్ట్ మీటర్లు నెలకొల్పడం ద్వారా విద్యుత్ ప్రయివేట్ చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పవర్ గ్రీడ్ సబ్ స్టేషన్ లను గంప్ప గుత్తాగా ఔట్ సోర్సింగ్ చేయమని ఆదేశించారు. స్మార్ట్ మీటర్లు అమలు సహా అన్ని కాంట్రాక్టులు ఆధానికే కట్టబెట్టారు. విద్యుత్ రంగాన్ని ప్రయివేట్ చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగ కార్మికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. నేడు చండీగఢ్, ఉత్తరప్రదేశ్ లలో పోరాటం లో కార్మికులు అగ్రభాగాన నిలుస్తున్నారు. ప్రవేటికరిస్తే ప్రజాలపై, కార్మికులకు చాలా నష్టాలు వాటిలే ప్రమాదం ఉందన్నారు. కావున మోడీ ప్రభుత్వ విధానాలను ప్రజలు ముక్త కంఠంతో వ్యతి రేకించాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు కార్యదర్శి ముక్కెర రామస్వామి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి మహబూబ్ పాషా గణిపాక ఓదెలు, ఎం.డి.ఇస్మాయిల్ రతన్ గౌడ్, రాఘవరెడ్డి, జుబేదా జహేదా, మాదాసు దివ్య, యాకమ్మ, ఎండి యాకు పాషా మన్సూర్, యాకమ్మ, సూరయ్య, జహీదా, స్వరూప,పెంటయ్య, విమల, సబ్ స్టేషన్ కార్మికులు డి కిష్టయ్య రహమత్ భద్రయ్య రాము సాంబయ్య నాగరాజు షరీఫ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు…

