Wednesday, April 1, 2026

కలసికట్టుగా పనిచేద్ధాం.. పార్టీని బలోపేతం చేసుకుందాం..!

  • ప్రతిపక్షంలోనే నాయకత్వ లక్షణాలు బయటకువస్తాయి
  • చిన్న, చిన్న విభేదాలు పక్కనపెట్టి అందరూ ఏకం కావాలి
  • పోరాడే సమయం వచ్చింది.. ప్రజల పక్షాన పోరాటం చేయాలి
  • ఆత్మీయ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ‘‘రాజకీయాల్లో కలసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలను సొంతం చేసుకోవచ్చు.. గత ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేశారు.. ప్రజలు మార్పు కోరుకున్నారు.. అధికారం పోయింది.. మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు మన ప్రజల తరపున పోరాటం చేయాలి.. ఇప్పుడు మనకు పోరాడే సమయం వచ్చింది.. కలసికట్టుగా పనిచేద్ధాం.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుందాం.. మన పార్టీలో నాయకుల మద్యన ఏదైనా చిన్న, చిన్న విభేదాలు వుంటే కూర్చుని పరిష్కరించుకుందాం.. ఒక కుటుంబంలో నలుగురు మద్యన విభేదాలు వస్తుంటాయి.. అలాగని ఆ కుటుంబంలో ఎవ్వరికి ఆపద వచ్చినా అందరూ ఒక్కటవుతారు.. అలాగే మన పార్టీ కూడా ఒక కుటుంబం వంటిది.. చిన్న పాటి విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐక్యతతో కలసిరావాలి.. ప్రతిపక్షం మన పార్టీకి కొత్త ఏమీ కాదు.. పోరాటాలతో పుట్టిన పార్టీ పోరాడటంలో జగనన్నను మించిన వారు ఎవ్వరు లేరు.. ఆయనే మనందరికీ స్ఫూర్తి.. ఇప్పుడు మనకు పోరాడే సమయం వచ్చింది.. ప్రజల పక్షాన కలసి మెలసి పోరాడుదాం..ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళదాం.. మీలో ఒక్కనిగా.. మీ కుటుంబం సభ్యునిగా ఎవ్వరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా.. ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలే కాదు.. వ్యక్తిగతంగా ఏ కార్యక్రమానికి పిలిచినా వస్తా.. మనమందరం కలసి మెలసి పనిచేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాలి.’’ అంటూ చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెల్లడించారు. పాకాల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్క నాయకుడుని ఆప్యాయంగా పలకరించి ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తనకు తెలియపరచాలన్నారు. మండలంలో ఏ ఒక్క నాయకుడుని పోలీసులు బెదిరించినా ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి అతనని బయటకు తీసుకు వచ్చేంత వరకు పోరాడితే పోలీసులు కూడా చట్టాన్ని అతక్రమించి అడ్డదిడ్డంగా పనిచేసే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడ తప్పు చేసినా నిలదీస్తే మరోసారి ఆ తప్పు జరగకుండా భాద్యతతో పనిచేస్తారని, ఆ పోరాటంలో మీతో పాటు తాను కూడా వస్తానన్నారు. జగనన్నను స్ఫూర్తిగా తీసుకుని పోరాటం చేయాలని, అప్పుడే బలమైన నాయకునిగా ఎదుగుతామన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదు.. మహా అయితే ప్రజలకు మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. అధికారం చేతిలో వున్నప్పుడు అందరూ మన దగ్గరకు వస్తారని, ప్రతి పక్షంలో మనకు దగ్గరగా వున్నవారి చేయిని ఎట్టి పరిస్థితుల్లో వదలనని మాట ఇచ్చారు. చంద్రగిరి నియోజక వర్గంలో పాజిటీవ్ పాలిటిక్స్ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రత్యర్థులు దానికి పూర్తి భిన్నంగా వెళుతున్నపుడు మనం కూడా అందుకు తగ్గట్టుగానే సిద్ధపడాలన్నారు. అనంతరం పాకాల మండల పార్టీ అధ్యక్షులుగా నియమితులైన నంగా నరేష్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఆయన సారథ్యంలో ప్రతి ఒక్కరు కలసి పనిచేయాలన్నారు. చివరగా మండల పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి భోజనం చేసి కష్ట, సుఖాల్లో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలం నుంచి సుమారు వంద మందికి పైగా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News