నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఓపెన్ జిమ్ మరియు ఓపెన్ ట్రాక్ కావాలని కమలాపూర్ మండల అభివృద్ధి అధికారి కి ప్రగతి యువజన సంక్షేమ సంఘం యువకులు వినతి పత్రం అందజేశారు. ఎంతోకాలంగా ఓపెన్ జిమ్ కావాలని ఎదురు చూస్తున్నామని అయినప్పటికీ కూడా అందుబాటులోకి రావడం లేదని అసంతృప్తిగా ఉన్నామని గ్రామ ప్రజలకు, గ్రామ యువతకు ఓపెన్ జిమ్ మరియు ఓపెన్ ట్రాక్ అందుబాటులోకి వచ్చేలా మీ వంతు కృషి చేయాలని ప్రగతి యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలసాని చిన్న కుమారస్వామి ఎంపీడీవోను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోడేటి సుందర్, పబ్బు జగన్, ప్రధాన కార్యదర్శి పబ్బు అశోక్, సహాయ కార్యదర్శి పచ్చిమట్ల రాజేందర్, సభ్యులు మండ చరణ్, పెరుమండ్ల ఓంకేశ్, కొత్తకొండ సాయి కుమార్, మండ రాజు, తోడేటి కుమారస్వామి, కొత్తకొండ రాజు, మార్క ప్రదీప్, కొత్తకొండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.