Sunday, March 15, 2026

‘‘వేగం కన్నా ప్రాణం మిన్న’’

  • జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ‘‘వేగం కన్నా ప్రాణం మిన్న’’ అనే విషయాన్ని ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలనీ తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రావీణ్య పేర్కొన్నారు’’. చిన్న చిన్న నిర్లక్ష్యమైన తప్పి దాల కారణంగా ప్రతి ఏటాఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో నెహ్రూ యువక కేంద్రం ఆధ్వర్యంలో గ్రామీణ వాలంటీర్లకు, స్వయం సహాయక సంఘాలకు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ఒక్కరోజు అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రజలలో ట్రాఫిక్‌ నిబంధనలు అవగాహన లోపం వలన తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరుగుతుందని వాటిని నివారించేందుకు నెహ్రు యువత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ట్రాన్స్పోర్ట్‌ మరియు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సహకారంతో ఈ నెల 17 నుండి 31 జనవరి వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహింప బడుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో యువతతో పాటు స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించిన వారం అవుతామని తద్వారా ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. నగర వాసులే కాకుండా ప్రతిరోజు గ్రామీణ ప్రాంతం నుండి వివిధ వాహనాల ద్వారా ప్రయాణించడం జరుగుతుందని ట్రాఫిక్‌ నిబంధనలు పాటు హెల్మెట్‌ ధరించడం, సేవించి వాహనాలు నడపడం, కారు నడిపేటప్పుడు సీటు బెల్ట్‌ ధరించడం.భారీ వాహనాలు నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు పార్కింగ్‌ చేయడం మొదలు తప్పిదాల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడం జరుగుతుందని తెలిపారు 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొంది ఉండాలని మితి మీరిన వేగంతో వాహనాలు నడపరాదని అన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలు నివారించ వచ్చునని ఆమె తెలిపారు. అదేవిధంగా ఆపద మిత్ర కార్యక్రమంలో భాగంగా యువ వాలంటీర్లను నియమించి ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించు ప్రమాదాలను నివారించేందుకు, అత్యవసర పరిస్థితిలో యువ వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి కలెక్టర్‌ కార్యాలయం నుండి అదాలత్‌ వరకు నిర్వహించే అవగాహన ర్యాలీని ప్రారంభించారు. నెహ్రు యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్‌ అన్వేష్‌ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా పరిధిలోని గ్రామీణ వాలంటీర్లకు. స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు దోహదపడగలరని అభిలాషించారు. ఈ సమావేశంలో ట్రాన్స్పోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసిపి ముప్పాల శ్రీనివాస్‌ ఏపీడి సుధీర్‌ జిల్లాట్రెజరీ అధికారి శ్రీనివాసరావు, సిఐ సీతారెడ్డి, నేషనల్‌ యూత్‌ అవార్డు గ్రహీత ఆకలపల్లి మధు జేడీఎం శ్రీనివాస్‌ ఎస్సై రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News