- లింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న జెడ్పి మాజీ చైర్ పర్సన్,
- కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ (రమేష్) : మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండలంలోని, కొల్లూరు గ్రామంలో గోటూర్ లింగేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





