Tuesday, March 17, 2026

తవక్కల్ పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం

నేటి సాక్షి, మందమర్రి:– పట్టణంలోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో వసంత పంచమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ పాఠశాలల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ హాజరై ముందుగా సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి, అనంతరం పిల్లలచే అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి దేవి జన్మదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి పండుగ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News