సంస్మరణ సభలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వోడితల ప్రణవ్
నేటిసాక్షి, భీమదేవరపల్లి :
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం పీవీ నరసింహారావు స్వగ్రామం వంగర గ్రామంలో పీవీ నరసింహారావు విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వంగరలో జరిగిన సంస్మరణ సభలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వోడితల ప్రణవ్ మాట్లాడుతూ… పీవీ నరసింహారావు గురించి మాట్లాడే వయసు గాని స్థాయి గాని లేదు.. పీవీ అంటే ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడు.. మన చేతికి మొబైల్ పోన్ లు, మనం తిరిగే కార్లు మన దేశానికి వచ్చినయంటే పీవీ కారణం … మా తరానికి టెక్నాలజీ అంటే పీవీ … పీవీ అంటే సాహిత్యం, కంప్యూటర్ ఆ కాలంలోనే వారు కంప్యూటర్ ప్రోగ్రాం గురించి చర్చించే వారు… మా కుటుంబానికి పీవీ గాడ్ ఫాదర్ అని కొనియాడారు. ఇక్కడ నిల్చొని హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నానంటే పీవీ గారే కారణం అని, మా తాత వోడితల రాజేశ్వర రావు గారు పీవీ తో సన్నిహిత సంబంధం ఉండేదని, చిన్నప్పటి నుండి పీవీ గారి గురించి చర్చించి రోజు లేదంటూ చెపారు. ఎన్నో విషయాలు గొప్ప గొప్ప అనుభావాలు చెప్పేవారని, ఒక లెటర్ రాయడ ప్రారంభిస్తే ముగిసే వరకు పెన్ను కూడా ఆయన తీసే వారు కాదని గుర్తుచేశారు. ఆయన గురించి ఎన్నో కథనాలు వినుకుంటూ పెరిగానని అన్నారు. ఈ గ్రామానికి వచ్చి వారి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని తెలిఅపారు. ఈకార్యక్రమంలో పీవీ నరసింహారావు గారి కుమార్తె ఎమ్మెల్సీ వాణి దేవి, పీవీ కుటుంబ సభ్యులు ,హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి వోడితల ప్రణవ్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.