- పరీక్షల సమయంలో ఎన్నికలు హడావిడిగా నిర్వహించడం ఏంటి ?
- బీసీ సంఘం జిల్లా నాయకులు, కొలిచలం శ్రీనివాసరావు
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: పరీక్షల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం ఉత్తమని, గ్రామీణ ప్రాంతాలలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం వలన గ్రామీణ ప్రాంతాలలోనే విద్యార్థిని విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారనీ బీసీ సంఘం జిల్లా నాయకులు కొలిచలం శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలు పదవీకాలం ముగిసి సంవత్సరం అయిపోయింది మండల జిల్లా పరిషత్ పదవీకాలం ముగిసి కూడా ఏడు నెలలు దాటిందని, ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా తీరా విద్యార్థులకు తీరా విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎన్నికల నిర్వహించడంతో ఎన్నికల ప్రభావం విద్యార్థులపై పడే అవకాశం ఉందన్నారు. టెన్త్ ఇంటర్ పరీక్షలు అయిపోగానే ఎన్నికలు నిర్వహించాలని ఇటు విద్యావేత్తలు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారనీ ప్రభుత్వం పరీక్షలు ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు.





