- లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి

నేటి సాక్షి, మందమర్రి:– మండలంలోని పులిమడుగు గ్రామంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనకయ్య (40) అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. 363 జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే వాళ్లు లారీ ట్యాంకర్ తో నేషనల్ హైవే మధ్యలో ఉన్న చెట్లకు నీరు పోస్తున్న క్రమంలో ఎనకాల నుంచి లారీ వచ్చి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నీళ్లు పోస్తున్న ట్యాంకర్ పక్క రహదారి వైపు ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ఢీ కొట్టిన వాహనదారుడు క్యాబిన్ లోనే కొన ప్రాణంతో దుర్మరణం పాలయ్యారు. నీళ్లు పోస్తున్న వాహనదారుడు మాదాసు తిరుపతి గాయాల పాలయ్యాడు. కాగా మృతుడు కనకయ్య పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ సమీపంలోని కన్నాల నివాసిగా గుర్తించారు. ఘటన స్థలానికి మందమర్రి ఎస్సై రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ చేరుకున్నారు. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని క్రేన్ సాయంతో బయటకు తీశారు. రోడ్డు ప్రమాదంతో దాదాపు అరగంట సేపు వాహనాలు నిలిపి వేసి అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.





