దేవస్థానం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ పాలకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మాచర్ల నరేష్ గౌడ్ హనుమాన్ దేవాలయం డైరెక్టర్ గా నియమితులు అయ్యారు. మాచర్ల నరేష్ గౌడ్ మాట్లాడుతూ హనుమాన్ దేవాలయంలో డైరెక్టర్ గా నియామకం అవ్వడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ కి, అలాగే సీనియర్ నాయకులు పత్తి కృష్ణా రెడ్డి, కాజిపేట్ శ్రీనివాస్ సీనియర్ నాయకులందరికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే దేవస్థానం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తానని తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, అలాగే కాంగ్రేస్ పార్టీ పట్టణఅధ్యక్షులు సొల్లుబాబు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రేస్, యూత్ నాయకులు నల్ల సుమన్, ఇప్పకాయల సాగర్ (ఈవీఎస్), రంగు శ్రీనివాస్, ఇప్పలపల్లి నరేష్, అరుణ్ శౌరి, రాజశేఖర్, సత్యం, ఇప్పలపల్లి చంద్రశేఖర్(చందు), భీమోజ్ వెంకటాచారి (వెంకట్), మురళి తదితరులు పాల్గొని నరేష్ గౌడ్ కి కు కృతజ్ఞతలు తెలియ జేయడం జరిగినది.

