Friday, April 3, 2026

రైతులకు రాయితీపై యంత్రాలు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు) :
వ్యవసాయ యాంత్రికరణ ఉప పథకము (SMAM) కింద రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించుటకు మహిళా రైతుల నుండి దరఖాస్తులు స్వికరిస్తున్నామని హుజురాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరములో 50శాతము పై సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు వచ్చాయాన్నారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలో హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, విణవంక, సైదాపూర్ మండలాల్లో బ్యాటరీ స్ప్రేయర్స్-32, పవర్ స్ప్రేయర్స్ -32, రోటావేటర్స్ -20 మరియు (డిస్క్ హార్రోస్/కల్టివేటర్స్/MB ప్లవ్/కేజ్ వీల్స్)-22 పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసక్తి మరియు అర్హత గల రైతులు వెంటనే దరఖాస్తు పత్రముతో ఒక ఫోటో, కొత్త పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ జిరాక్స్ మరియు ట్రాక్టర్ తో పని చేయు యంత్రాలకు ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు జత చేసి ఆయా మండల వ్యవసాయ కార్యాలయాల్లో ఇవ్వగలరని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News