నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి : కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామంలో వేంచేసి ఉన్న ప్రాచీన భ్రమరాంబా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఐదు రోజులపాటు జరగనున్న మహా శివరాత్రి వేడుకలు నేడు అత్యంత వైభవంగా రంభమయ్యాయి.కార్యక్రమంలో భాగంగా ముందుగా మంగళ వాయిద్యాలతో దేవాలయ ఆవరణ మామిడి తోరణాలతో అలంకరించారు.తదుపరి గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షా ధారణ, పంచ గవ్యప్రాసన, అఖండ స్థాపన, మండపారాధ, అంకురార్పణ అనంతరం ధ్వజారోహణ, వృషభ ముద్దలు వంటి వైదిక క్రతువులు నిర్వహించారు.రేపు తెల్లవారుజాము నుండే నిత్య అభిషేకాలు తదుపరి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కళ్యాణ మూర్తులకు నదీజలాలు, సుగంధ ద్రవ్యాలతో నవకలశ అభిషేకం, నూతన పట్టు వస్త్రాల అలంకరణ, హోమం జరుగును.రాత్రి 8గం.ల నుండి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని కోదాడ పరిసర ప్రాంత ప్రజలు మేల్లచెర్వుతో పాటు మార్గంలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించాలని దేవాలయ కమిటీ చైర్మన్ యాదా శ్రీనివాసరావు తెలిపారు.భక్తుల సౌకర్యారార్ధం, పెరుగుతున్న ఎండ తీవ్రతలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టెంట్లు, మంచినీటి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.స్వామివార్లకు నూతన పట్టు వస్త్రాలు యాదా శ్రీనివాసరావు-మీనా, ఉపేందర్-సంగీత దంపతులు అందజేశారు.కార్యక్రమంలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ అమరనాయుని వెంకటేశ్వరరావు, దేవాలయ కమిటీ సభ్యులు నందుల శాస్త్రి, చిల్లా వేంకటేశ్వర్లు, అమరబోయిన నాగరాజు, మునగ మధు మధు, నామాల లక్ష్మీనారాయణ, ముక్కా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.




