నేటి సాక్షి, హైదరాబాద్: ఎన్హెచ్ఎంలో పని చేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజేషన్తో పాటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జూలై 30 (మంగళవారం) హైదరాబాద్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ముందు మహాధర్నా నిర్వహిస్తున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో దిగులకు పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు సవరించి పెంచకుండా గత ప్రభుత్వం లాగానే దాట వేస్తుందని ఆరోపించారు. వెంటనే కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, జాతీయ ఆరోగ్య మిషన్ పని చేస్తున్న 17514 మందికి శ్రమ దోపిడీకి గురవుతూ పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావించి పని చేస్తుంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేయటాన్ని ఆయన విమర్శించారు. హైదరాబాద్లో నిర్వహించే ధర్నాకు 33 జిల్లాల్లో పనిచేస్తున్న ప్రతి క్యాడర్ కదిలి వచ్చి, జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.