Monday, March 30, 2026

డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మహర్దశ

  • మౌలిక సదుపాయాల కల్పన కోసం 4,66,94,238 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • ప్రొసీడింగ్స్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
  • ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు మహర్దశ చేకూరినట్లు వనపర్తి శాసనసభ్యులు సభ్యులు మేఘారెడ్డి పేర్కొన్నారు.గత పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందే తప్ప నిరుపేదలకు కేటాయించిన ఇండ్ల నాణ్యతలో మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు.నిరుపేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో, విద్యుద్దీకరణ, తాగునీటి సమస్య, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి నివేదించిన అభ్యర్థన మేరకు స్పందించిన మంత్రి వనపర్తి నియోజకవర్గ పరిధిలో వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 909 డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను 4,66,94,283కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఖిల్లా ఘణపురం మండలంలోని.గార్లబండ తండా కు చెందిన 20 డబల్ బెడ్ రూమ్ లకు,కర్నే తండా షాపూర్ కు చెందిన 5 డబల్ బెడ్ రూమ్ లకు,కోతులకుంట తండాకు చెందిన 24 డబల్ బెడ్ రూమ్ లకు,మామిడిమాడ గ్రామానికి చెందిన 40 డబల్ బెడ్ రూములకు,ముందరితండాకు చెందిన 15 డబుల్ బెడ్ రూమ్ లకు, సల్కేలాపురం గ్రామానికి చెందిన 50 డబుల్ బెడ్ రూమ్ లకు, తిరుమలాయపల్లి గ్రామానికి చెందిన 20 డబల్ బెడ్ రూమ్ లకు, పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన 100 డబుల్ బెడ్ రూమ్ లకు,పెబ్బేరు కు చెందిన 24 డబల్ బెడ్ రూమ్ లకు, పెద్దమందడి మండలం బుగ్గ పల్లి తండా కు చెందిన 17 డబల్ బెడ్ రూమ్ లకు,వనపర్తి పీర్లగుట్టకు చెందిన 144 డబల్ బెడ్ రూమ్ లకు,పీర్లగుట్టకు చెందిన 150 డబుల్ బెడ్ రూమ్ లకు,వనపర్తి రాజపేటకు చెందిన 96 డబల్ బెడ్ రూమ్ లకు,వనపర్తి మండలం చిట్యాల కు చెందిన 294 డబులు బెడ్ రూమ్ లకు,నిధులు మంజూరయ్యాయని ఇందుకు సంబంధించిన పనులను వెంటనే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.అడిగిన వెంటనే స్పందిస్తూ నిధులు మంజూరు చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి,వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News