- తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కి వినతిని సమర్పించిన పులివర్తి నాని
- ఎమ్మెల్యే అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : యర్రావారిపాళ్యం మండలంలోని నెరబైలు పంచాయతీ పరిధిలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలిసి తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పులివర్తి నాని కోరారు. ఆలయ ప్రాంగణంలో కోనేరు, స్నానాల గదులకు మరికొన్ని అభివృద్ధి పనులకు ఆలయ అధికారులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల నుంచి వివరాలు సేకరించి వాటికి సుమారుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అంచనా వేసి ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గారు వివరించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి గత కొద్దిరోజులకు మునుపు జరిగిన మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ఆరా తీసి అంగరంగ వైభవంగా మహాశివరాత్రి నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులగూర్చి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు నాయుడు వీలైనంత త్వరలోనే నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే కి హామీ ఇచ్చారు . సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి నాని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



