నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జాతిపితను స్మరించుకోవడం జరిగింది. శాంతి అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన భారత జాతి పితామహుడు ఆహింసమూర్తి మహాత్మా గాంధీ సేవలు తరతరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగాని శివ కృష్ణ, గట్టు శ్రీధర్, మిల్కూరి శ్రీనివాస్, కిన్నెర కృష్ణమూర్తి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దూడ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లం రాజిరెడ్డి, పుల్లూరు శ్రీనివాసరావు, డాక్టర్ మౌటం కుమారస్వామి, కంభంపాటి ప్రసాద్, ఆన్కార్ అశోక్, మస్న చంద్రశేఖర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు శనిగరపు రమేష్, పుల్ల సునీల్, మాట్ల రాజేష్, ఒస్కుల వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





