నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : గాంధీజీ వర్ధంతి – నేటి యువతకు గాంధీజీ మార్గదర్శనం. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహాత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకొని ‘షహీద్ దివస్’ జరిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. జై కిషన్ ఓఝా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు. చేసిన గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి ఘనమైన నివాళి అర్పించారు. కార్యక్రమాన్ని ఎన్. ఎస్. ఎస్. వాలుంటీర్లు ఎన్. సీ. సీ. కాడేట్స్ సంయుక్తంగా నిర్వహించారు. సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.గాంధీజీ యొక్క నిస్వార్దపూరితమైన జీవన విధానం, సత్యాగ్రహాన్ని నడిపించిన తీరు, క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించిన తీరు, దండి సత్యాగ్రహాన్ని ముందుకు తీసుకుపోయిన తీరు నేటి యువత ఎంతైనా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గాంధీజీ యొక్క సాదా సీదా జీవన విధానం ఎంతైనా అనుసరణియం అన్నారు. ప్రతిష్టమైన గాంధీజీ నాయకత్వం అసంఖ్యాకమైన శిస్యఘణాన్ని ఏర్పరచిందని అన్నారు. ఈ దేశ సమైక్యత కోసం గాంధీజీ చివరి శ్వాస వరకు జీవించారని వీరి త్యాగ పూరితమైన జీవితాన్ని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో ఎన్. ఎస్. ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్లు ఏ. సాంబశివ రావు, డా. కిరణ్మయి, ఎన్. సి. సి ఏ. ఎన్. ఓ లెఫ్టినెంట్ తిరుపతి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా. సుబ్బారావు, సీనియర్ అధ్యాపకులు సవిత, డా. శారద, శ్రీదేవి, డా. శంకరయ్య, డా. సురేష్, ఆంజనేయులు, డా. రామకృష్ణ, డా. స్రవంతి, డా. పి ఉషా రాణి, వి. నరేష్, డా. రవీందర్, సమత, అరుణ , బి. నరేష్, కిరణ్ కుమార్ తదితరులు, ఎన్. ఎస్. ఎస్. వాలంటీర్లు, ఎన్. సి. సి కాడేడ్స్ పాల్గొన్నారు.





