నేటి సాక్షి రామడుగు, (పురాణం సంపత్) : మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రామడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడైన జవ్వాజి హరీష్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ హరీష్ మహాత్మాగాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస సత్య గ్రహాలే ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహనీయుడు అని కొనియాడారు.నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవెని తిరుపతి, మాజీ సర్పంచ్ కోల రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పరశురాం, తదితరులు పాల్గొన్నారు.





