నేటి సాక్షి, పెగడపల్లి(కె గంగాధర్):
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లె గ్రామానికి చెందిన మహేశుని శంకరయ్యను తెలంగాణ చేనేత ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధిగా డిసెంబర్ 29న జరిగిన చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ నా మీద నమ్మకంతో ఈ పదవి రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ గాజుల గంగ మల్లేశం కు, రాష్ట్ర కార్యదర్శి ముల్క రాజేశంకు, జిల్లా అధ్యక్షులు సిరిసిల్ల సురేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలి సంఘం కోసం చేనేత కార్మికుల అభివృద్ధి సమస్యల కోసం నిరంతరం నా వంతు కృషి చేస్తానని అన్నారు.

