Wednesday, March 25, 2026

తుమ్మలూర్ అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా,మహేశ్వరం మండలం, తుమ్మలూర్ గ్రామం, సర్వే నెంబర్ . 378 లో గల సుమారు 5 ఎకరాల భూమిని అసలు యజమాని అయిన హైద్రాబాద్‌కు చెందిన విజయలక్ష్మి కి తెలియకుండా,మహేశ్వరం గ్రామానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ శుకూర్ తండ్రి వాహెద్ మరియు చంద్రయాన్ గుట్టకు చెందిన సబెర్ బిన్ మొహమ్మద్ బస్రవి అనే నిందితులు కొంత మంది తో కలిసి మోసపూరితంగా శుకూర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఈ సంఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో,తేది 21.09.2024న కేసు నమోదు చేయబడింది.విచారణలో నిందితుల తప్పుడు కార్యకలాపాలు నిరూపితమైన నేపథ్యంలో, నిందితుల్లో ఒకరైన సబెర్ బిన్ మొహమ్మద్ బస్రవి ను తేది 28.02.2025 నాడు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడమైనది.ఇతర నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు భూసంబంధ సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని,ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేయడమైనది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News