- మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ప్రభుత్వము వారు ప్రతీష్టాత్మకముగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమములో భాగంగా, హుజూరాబాద్ పట్టణమును స్వచ్చ హుజూరాబాద్ గా తీర్చిదిద్దుటకు గాను ప్రజలెవ్వరు కూడా చెత్తను రోడ్ల పై వేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించుటకు గాను పురపాలక సంఘ కమిషనర్ కెంసారపు సమ్మయ్య ఆధ్వర్యములో తేదీ: 17-03-2025 రోజున పట్టణములోని 22వ వార్డు నందు తడిపొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమము యందు కమిషనర్ కెంసారపు సమ్మయ్య గారు, 22వ వార్డు తాజా మాజీ వార్డు సభ్యులు పైళ్ళ వెంకట్ రెడ్డి గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు గారు, సానిటరీ జవాన్ రొంటాల సుధీర్ గారు, మెప్మా CLRP & RP జె. రమాదేవి గారు, 22వ వార్డు ప్రజలు మరియు పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.





