- జాగిరి శ్రీనివాస్ గౌడ్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సర్వాయి మొకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. శనివారం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో పట్టభద్రులతో ఆయన మాట్లాడుతూ.. డా. ప్రసన్న హరిక్రిష్ణ గౌడ్ అసిస్టెంటు ప్రొఫెసర్ గా వివిధ స్థాయిలో భోదన చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ రంగాలలో స్థిరపడటానికి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయుటకు వారిని విజ్ఞాన వంతులను చేయుటకు వివిధ మార్గాలలో కృషి చేశారన్నారు. ఉచిత కోచింగ్ సెంటర్ల ద్వారా విద్యాభోధనతో పాటు, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ చేశారని, స్వయంగా పరిశోధ నాత్మకమైనటువంటి పుస్తకాలను రచించి ప్రచురించినారని, పేద విద్యార్థినులను గుర్తించి వారికి విద్యాపరంగా ఆర్థిక సహాయం చేసారని. కరోన సమయంలో కరీంనగర్ మండలం కాట్నపల్లి గ్రామంలో తల్లి, తండ్రులను కోల్పోయి .అనాథలైన ఇద్దరు బాలికలకు తన వంతుగా సహాయంగా సన్నిహిత మిత్రుల ద్వారా విరాళాలు సేకరించి రూ. 3 లక్షల పై చిలుకు ఆర్థిక సహాయం అందించినారని బడుగు బలహీన వర్గాల నుండి మేధావిగా ఎదిగినటువంటి బీసీ గౌడ ముద్దుబిడ్డ డా. ప్రసన్న హరిక్రిష్ణ గౌడ్ కు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల, నిరుద్యోగుల, పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాడని, డా. పులి ప్రస్నన్న హరిక్రిష్ణ గౌడ్ ఆశయాలను సిద్ధాంతాలు, సేవ గుణములను అన్నింటిని పరిగణలోనికి తీసుకుని చట్ట సభలలో మాట్లాడే విషయ పరిజ్ఞానం, భాషపై పట్టు కలిగి ధైర్యమున్న వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్, నేలపట్ల శంకర్ గౌడ్ నేలపట్ల ఎల్లయ్య గౌడ్, విజయ్, శారద తదితరులు పాల్గొన్నారు.





