- బిల్డింగ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి – పిట్టల సమ్మయ్య
నేటి సాక్షి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ లో సైదాపూర్ మండల తాపీ మేస్త్రీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిల్డింగ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ కార్మికులంతా ఏకమై కార్మికుల సమస్యలు, భవిష్యత్ కర్తవ్యాలు అమలు కొరకు ఈ నెల 16 న ఆదివారం జరిగే 3వ మహా సభలో భవన నిర్మాణ కార్మికుల పాల్గొన వలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైధపూర్ భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు పోలోజు చంద్రయ్య, బొరగల్ల మోహన్, రంగారావు, మల్లేష్, రఘుపతి, బోయిని శ్రీను, మొలుగూరి వెంకటపతి, గోదారి లక్షమన్, అంభిగల్ల అనిల్ పాల్గొన్నారు.



