- సిపిఎం పిలుపు
నేటి సాక్షి, రామాపురం మండలం ప్రతినిధి భక్త కుమార్ : 2025 మార్చి 11వ తేది నాడు స్థానిక సుందరయ్య భవనం నందు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రగతి అడ్డుకుంటున్న నిరుద్యోగంపై పోరాడుదామని కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలోనే ఏర్పాటు చేయాలని మార్చి 14న కడపలో నిర్వహించే నిరుద్యోగ వ్యతిరేక సదస్సును జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ సభ్యులు ముడియం చిన్ని మాట్లాడుతూ… దేశంలో నిరుద్యోగం రోజురోజుకీ తారాస్థాయికి చేరిందని, గ్రామీణ ప్రాంతాలలో కాయ కష్టం చేసే యువతి, యువకులు పనులు లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని, చదువుకున్న యువతీ, యువకులు ఉద్యోగ- ఉపాధి అవకాశాలు లేక నిరాశ విస్తృహలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా దేశంలోని ప్రజల శ్రమశక్తితో సృష్టిస్తున్న సంపదను 2022- 2023 ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం 1% సంపన్నులకు 22. 6% ఆదాయాలను 40.1% దేశ సంపదను సొంతం చేసుకుంటున్నారని, గణాంక లెక్కలతో రుజువు చేశారని, ఈ పరిస్థితి బ్రిటిష్ వలస పరిపాలన కాలంనాటి కన్నా కూడా ఇది చాలా ఎక్కువగా ఉందని, దేశంలోనే 50% మంది ప్రజల్లో కేవలం3% సంపద మాత్రమే ఉందని ప్రజల జీవన ప్రమాణాలు బాగా పడిపోతున్నాయని వారు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి యువకుల సమస్యలను ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విధానాలు పాలసీలు రూపొందించుకోవడం లేదన్నారు. బిజెపి పాలకులు యువతకు ఉపాధి కల్పించకుండా మత ఉన్మాదం వైపు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, నేటి యువతరం ఆలోచించి దేశంలో నిరుద్యోగ సమస్యను అర్థం చేసుకొని సరైన వైఖరిని తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా విద్యాదికులైన యువతీ యువకులపై మరింత ఎక్కువగా ఉందని, మూడోసారి ప్రధాని అయినా నరేంద్ర మోడీ ఎన్నికల వాగ్దానం ప్రతి ఏటా కోటి మందికి ఉద్యోగులు మేక్ ఇన్ ఇండియా నినాదం బూటకమని తేలిపోయిందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 38వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న బాబు ఎన్నికల వాగ్దానం మాట తప్పారని, అగ్నిపద్ పేరుతో చివరికి సైన్యంలో కూడా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ దేశ భద్రతకు ప్రమాదంగా పరిణమిస్తుందని, పొట్టకూటికోసం అమెరికాకు వెళ్లిన యువతకు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా కాళ్లకు చేతులకు సంకెళ్లు వేసి మూడు యుద్ధ ఖైదీల విమానాలలో పంపిన దేశభక్తి గురించి మాట్లాడే మన ప్రధాని మోడీకి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.గ్యాస్, చమురు ఆయుధాల కొనుగోలు చేయడానికి అమెరికాలో నిసిగ్గుగా రెండు రోజుల పర్యటన చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం సోషలిస్టు ఆర్థిక విధానాలు అమలే అనివార్యమని నినాదిద్దాం 2025 మార్చి 14వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 కు కడప నగరంలోని బాలాజీ నగర్, ఎస్వీ డిగ్రీ కళాశాల వద్దనున్న యుటిఎఫ్ భవనం నందు జరుగు నిరుద్యోగ వ్యతిరేక సదస్సు కు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ విద్యార్థి యువతి యువకులు ప్రజా అనుకూల మేధావులు హాజరుకావాలని అలాగే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వచ్చేవరకు పోరాడుదామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ సభ్యులు షేక్ మస్తాన్ షరీఫ్, సగిలి రాయప్ప, షేక్ కైరున్ బీ, పసుపుల మోక్షమ్మ, చెప్పాలి సుబ్బరాయుడు, గంప అనంతమ్మ, శాఖా కార్యదర్శులు కొండయ్య, బాలమ్మ, రత్నమ్మ, మస్తాన్ బీ ఎస్కే ఆదిల్ ముడుమాల ఓబుల్ రెడ్డి నాగేశ్వరి రోజమ్మ రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.



