Wednesday, March 18, 2026

బిజెపి బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జరుగనున్న అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి అంజిరెడ్డికి అధిక సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లు పడేలా కృషిచేసి, ఆయనను గెలిపించాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి మండలం నుండి అత్యధిక సంఖ్యలో పట్టబద్రుల మొదటి ప్రాధాన్యత ఓట్లు బిజెపికి పడేలా అందరూ కలిసికట్టుగా కార్యములకై పనిచేసి, బిజెపి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి, కొయ్యల హేమాజీ, మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ చల్ల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, సీనియర్ నాయకులు గోనే శ్యాంసుందర్ రావు, మున్నా రాజా సిసోడియా, ఆరుముల్ల పోశం, డాక్టర్ రఘునందన్, తులా ఆంజనేయులు, బిజెపి మండల అధ్యక్షులు, మండల ఇంచార్జ్ లు, రాష్ట్ర, జిల్లా నాయకులు, జిల్లా మోర్చాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News